Namaste NRI

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహావిష్కరణ

ప్రఖ్యాత నటుడు, దివంగత డా॥ అల్లు రామలింగయ్య 101వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని అల్లు బిజినెస్‌ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ ఆవిష్కరించారు.  అల్లు అయాన్ మాట్లాడుతూ  శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య తాతగారి  విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా, ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి.  తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి అని అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌, శిరీష్‌, కొణిదెల సురేఖతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events