శ్రీవిష్ణు హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి. కయ్యదు లోహర్ కథానాయిక. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కం బబిత సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరును పెంచారు. తనికెళ్ల భరణి, సుమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను నాచురల్‌స్టార్ నాని చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తనికెళ్ల భరణి ఒక యువకుడికి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైంది. శ్రీవిష్ణు అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీవిష్ణు భార్యగా కయదు లోహర్ తన పాత్రను చక్కగా పోషించింది. ట్రైలర్ చాలా బాగుందన్నారు. శ్రీవిష్ణుకి కూడా కొత్తగా ఉందన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉందన్నారు. ఈ చిత్రం పెద్ద సక్సెక్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని తెలిపారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, గేయరచయిత రాంబాబు గోసాల పాల్గొన్నారు.