శ్రీ విష్ణు ఎడ్యూకేషనల్ సొసైటీ (ఎస్‌వీఈఎస్) ఆధ్వర్యంలో ఆ సంస్థ అనుబంధ కళాశాలల పూర్వ విద్యార్థుల యూఎస్‌ఏ అలుమ్ని మీట్ 2023 కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ బీ.వీ. రాజును స్మరించుకున్నారు. న్యూజెర్సీ ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో శ్రీ విష్ణు ఎడ్యూకేషనల్ సొసైటీ గ్రూప్ కళాశాలల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. 26 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎస్‌వీఈఎస్ నర్సాపూర్ చెందిన పూర్వ విద్యార్థులతోనూ పెద్ద అలుమ్ని అసోసియేషన్ అమెరికాలో కొనసాగుతుంది. ఫస్ట్ బ్యాచ్ నుంచి 2021 వరకు పూర్వ విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ విద్యా సంస్థలత స్థాపన, ఎదుగుదల, ఫిలాసిఫీ గురించి ఎస్‌వీఈఎస్ చైర్మన్ కె.వి.విష్ణు రాజు వివరించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఆనాటి తమ పాత జ్ఞాపకాలు నెమరువేరుస్తున్నారు. ఒకరికొరు ఆత్మీయంగా పలకరించుకుంటూ సందడిగా గడిపారు. న్యూజెర్సీలో సెప్టెంబర్ 30న ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 7న ఫ్లోరిడా ( ఓర్లోండో)లో, అక్టోబర్ 8 డల్లాస్ (టెక్సాస్)లో నిర్వహించనున్నారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ కె.వి.విష్ణు రాజు, వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, సెక్రటరీ కె.ఆదిత్య, విస్సం, విష్ణు డెంటల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎ.కే.వీ రాజు పాల్గొన్నారు.