
అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది. జమ్ము లోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి సోమవారం మరో 4,875 మంది భక్తులు బయల్దేరారు. ఆదివారం వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ 15,000 మందికిపైగా భక్తులు అమర లింగేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు.
