Namaste NRI

అమెజాన్‌ కీలక నిర్ణయం… 18 వేల మంది ఉద్యోగులపై

 ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. ఈమేరకు ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు. నవంబర్‌లో తొలగించిన దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఆండీ జాస్సీ చెప్పారు. జనవరి 18 నుంచి తొలగించే ఉద్యోగలకు సమాచారం అందిస్తామని తెలిపారు. ఇది యూరప్‌ దేశాల్లో ఉంటుందని స్పష్టం చేశారు.   ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో 1.54 మిలియన్ల మంది ఉద్యోగులున్నారు.

 కరోనా సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా భారీ సంఖ్యలో నియామకాలు జరిగాయి. 2020 నుంచి2022 మధ్యలో సిబ్బంది సంఖ్య దాదాపు రెట్టింపైంది.  ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వ్యాపారం నెమ్మదించింది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యం అయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు చేపట్టాల్సి వచ్చింది. ఉద్వాసనకు గురైన వారికి తమవంతు సహకారం అందిస్తాం. ప్రత్యేక ప్యాకేజీ, బీమా ప్రయోజనాలు కల్పిస్తాం అని అమెజాన్‌ సీఈవో జస్సీ తెలిపారు.

Social Share Spread Message

Latest News