తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) అధ్యక్షులు శ్రీ వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో అమెరికా అంతట ప్రప్రథమంగా తెలంగాణ బోనాలు ఈ ఆషాడ మాసమంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా, వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరమందు లాల్ ధర్వాజ, లష్కర్ బోనాలను మరిపించే విధంగా, తెలంగాణలోని ప్రతి పల్లెని మైమరిపించే విధంగా, ఘనంగా నిర్వహించారు. సియోటెల్ ఆడపడుచులందరు బోనమెత్తి, పోతురాజు నృత్యాలతో సాగుతుండగా, తొట్టెలతో ఉత్సవం అట్టహాసంగా సాగింది. సియాటెల్ నగర ప్రజలు, పుర ప్రముఖులు అమ్మవారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు సమర్పించి తెలంగాణ, అమెరికా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశించారు.

ఈ కార్యక్రమంలో 1000 మంది పాల్గొని తెలంగాణ విందు భోజనాన్ని ఆస్వాదించారు. అనేక మంది వాలంటీర్లు, ఆహ్వానితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండ, ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. అమెరికాలో ప్రపథమంగా బోనాలను నిర్వహించి, దాని శస్త్య్రాన్ని నూతన తరానికి అందిస్తున్న శ్రీ వంశీరెడ్డి కంచరకుంట్లని, మరియు అతని కార్యవర్గాన్ని టీటీఏ ఫౌండర్ పైళ్ళ మల్లారెడ్డి గారు, అడ్వైజైర్ కౌన్సిల్ మెంబర్స్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ పటోళ్ళ గారు, భరత్ మాదాడి గారు అభినందించారు.

