Namaste NRI

కెనడా టొరంటోలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

కెనడాలోని టొరంటో నగరంలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామానికి సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులతోపాటు వేడుకకు హాజరైన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.  ఆర్గనైజర్ సూర్య కొండేటి మాట్లాడుతూ.. దీపావళి ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ అవడానికి కృషి చేసిన 120 మంది వలంటీర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ  కెనడా చరిత్రలోనే అతిపెద్ద దీపావళి ఈవెంట్‌గా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. ఇకపై  మరిన్ని వేడుకలను నిర్వహించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతామని చెప్పారు.

  మిషన్ అఫ్ మదర్ సహకారంతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల, సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.   దీనా రెడ్డి ముత్తుకూరు మరియు రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీంద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యంతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి.  సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాషల్లోని పాటలకు డ్యాన్సులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సుమారు 1500 మంది అతిథులు పాల్గొన్నారు. అతిథులందరికీ 14 రకాల వంటకాలను రుచి చూపించారు. పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events