ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా లబ్ది పొందుతున్నదని టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ అన్నారు. ట్విట్టర్ సంస్థ ఈసీవోగా భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్‌ను నియమించిన విషయం తెలిసిందే. దీనిపై టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ స్పందించారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ నియామకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐజీఎం, పాలో ఆల్టో నెట్వర్క్, ఇప్పుడు ట్విట్టర్ సీఈవోలు అందరూ ఇండియాలో పుట్టి, పెరిగినవాళ్లే అని అన్నారు. టెక్నాలజీ ప్రపంచంలో భారతీయుల అమోఘమైన విజయాన్ని సాధించడం అద్భుతంగా ఉందని అన్నారు. ఇమిగ్రాంట్లకు అమెరికా ఇస్తున్న అవకాశాలు సద్వినియోగం అవుతున్నట్లు ఆయన తెలిపారు.