అమెరికా 9/11 దాడులు జరిగి 20 ఏళ్ల పూర్తయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఉగ్రదాడిలో 3 వేల మందికి పైగా మరణించారు. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులకు సౌదీ అరేబియా ప్రభుత్వం సహకరించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో 9/11 దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఓ దర్యాప్తు నివేదికను బహిర్గతం చేసింది. నాడు దాడుల్లో ఇద్దరు హైజాకర్లను సౌదీ సాయం చేసిందన్న ఆరోపణలపై నిర్వహించిన దర్యాప్తు వివరాలు వెల్లడిరచింది. హైజాకర్లకు అమెరికాలో ఉంటున్న సౌదీ పౌరులతో సంబంధాలున్నాయని, కానీ సౌదీ ప్రభుత్వతమే నేరుగా హైజాకర్లకు సాయం చేసిందని చెప్పడానికి ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది.