Skip to main content

Namaste NRI

మేం ఎలా జీవించాలో నిర్ణయించే హక్కు… అమెరికాకు లేదు 

అమెరికాపై రష్యా మరోసారి నిప్పులు చెరిగింది. తామెలా జీవించాలనేది నిర్ణయించే హక్కు అమెరికాకు లేదని మండిపడింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌  తాజాగా రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కిమ్‌ సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే, వీరి భేటీపై అమెరికాతోపాటు దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.  దాంతో రష్యా తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా అమెరికాపై నిప్పులు చెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూ గందరగోళాన్ని సృష్టించే మీరు  ఉత్తర కొరియాతో సంబంధాలపై మాకు నీతులు చెప్పొద్దని వ్యాఖ్యానించింది. మేం ఎలా జీవించాలో నిర్ణయించే హక్కు అమెరికాకు లేదు అని మండిపడింది. ఈ మేరకు అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలి ఆంటోనొవ్‌ ఒక ప్రకటన చేశారు.

Social Share Spread Message

Latest News