తనను గద్దె దింపేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్ర పన్నిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఆర్మీ ఖండిరచింది. పాక్ అంతర్గ వ్యవహారాల్లో అమెరికా హస్తం ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో సత్సంబంధాలు నెరపాలన్నదే తమ అభిమతమని తెలిపింది. ఇరు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దేశంలో వచ్చిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో కూడా ఏలాంటి దౌత్య పరమైన కారణాలు లేవని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వానికి అమెరికా ఎలాంటి లేఖలూ పంపలేదని కూడా సైన్యం ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)