Namaste NRI

ఐసీసీ అరుదైన క్ల‌బ్‌లో అమెరికా

ఐసీసీ టోర్నీల్లో ప‌సికూన‌లు పెద్ద జ‌ట్ల‌కు షాకివ్వ‌డం త‌ర‌చూ జ‌రిగేదే. ఒక‌ప్పుడు బంగ్లాదేశ్, కెన్యా, ఐర్లాండ్, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అయితే, ఇప్పుడు యూఎస్ఏ  జ‌ట్టు అద్భుత విజ‌యాల‌తో దూసుకు పోతోంది. తొలి పోరులోనే 196 ప‌రుగుల టార్గెట్‌ను ఊదేసిన అమెరికా మాజీ చాంపియ‌న్ పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. దాంతో, పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే గుర్తుండిపోయే రికార్డు నెల‌కొల్పింది. పాక్‌పై అమెరికా విజ‌యానికి ఐసీసీ అరుదైన క్ల‌బ్‌లో చోటు ద‌క్కింది. మెగా టోర్నీలో పెద్ద టీమ్‌ల‌కు షాకిచ్చిన ఐదో జ‌ట్టుగా ఆతిథ్య యూఎస్ఏ రికార్డు పుట‌ల్లోకి ఎక్కింది. 

పొట్టి ఫార్మాట్ అంటేనే రికార్డు విజ‌యాలకు, సంచ‌ల‌నాల‌కు నెల‌వు. అందుకు త‌గ్గ‌ట్టే ఈ మెగా టోర్నీ రెండో సీజ‌న్‌లోనే నెదర్లాండ్స్  జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం న‌మోదు చేసి ఔరా అనిపించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో డ‌చ్ జ‌ట్టు ఆఖ‌రి బంతికి జ‌య‌భేరి మోగించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events