Namaste NRI

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఇజ్రాయెల్‌కు సాయంగా ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్‌తో పాటూ యుద్ధ విమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్‌తోపాటు యుద్ధ విమానాలు, నౌకలను పెంటగాన్‌ రంగంలోకి దింపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు మధ్యదరా సముద్రంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరాయి. భూ, వాయు మార్గాల్లో దాడులు చేసే క్షిపణుల్ని ఈ నౌకల ద్వారా పంపుతోంది. అంతే కాదు ఈ యుద్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events