భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగానుమతి కోసం విద్యార్థుల దరఖాస్తులను త్వరత గతిన పరిశీలించేందుకు వీలుగా ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సైన్స్, మ్యాథ్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లోని విద్యార్థులు తమ ఓపీటీ, ఓపీటీ పొడిగింపు కోసం ప్రీమియం ప్రాసెసింగ్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది.కొన్ని కేటగిరీల విద్యార్థులకు మార్చి 6 నుంచే ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారు ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.