అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓ వైపు లక్షల్లో వైరస్ కేసుల నమోదవ్వగా, మరణాలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. తాజాగా జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం కోవిడ్ 19 మరణాల సంఖ్య దాదాపు 9 లక్షలకు పైనే చేరుకుందని పేర్కొంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫ్‌క్షన్‌లు, ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా అమెరికాలో మరణాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అత్యధికం అని వెల్లడిరచింది. అమెరికా తర్వాత 6 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో, 5 లక్షల మరణాలతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. అంతేకాదు ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్ బయోఎన్‌టెక్ రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌లు ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపింది.














