Namaste NRI

అమెరికాలో మరోసారి కలకలం

అమెరికాలో  మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ (ఫ్రొఫెసర్‌) మృతిచెందాడు. వర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడిన దుండగుడు సైన్స్‌ భవనంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరెవరీకి గాయాలవలేదని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతడేనా లేదా అని తెలియాల్సి ఉంది. అనుమానితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని వర్సిటీ చాన్సలర్‌ కెవిన్‌ గుస్కివీజ్‌ చెప్పారు. వర్సిటీలో కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, క్యాంపస్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events