Namaste NRI

భారత్‌కు అమెరికా కీలక భాగస్వామి : మోడీ

ఉగ్రవాదం ఇప్పటికి ప్రమాదకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చారిత్రాత్మకంగా గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది యుద్ధాల యుగం కాదని మరోసారి చెబుతున్నానని, రక్షణ దిగుమతుల్లో భారత్‌కు అమెరికా కీలక భాగస్వామి అని ప్రశంసించారు. భారత్ పెద్దగా ఎదగడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత దేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. మోడీ ప్రసంగిస్తుండగా ఆద్యంతం చప్పట్లతో సభ మార్మోగిందన్నారు. మోడీ మోడీ అంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు నినదించారు. ఆమెరికా-బైడెన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్-అమెరికా సంబంధాల్లో ముఖ్యమైన రోజు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రశంసించారు. వాణిజ్య సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని, బెంగళూరు, అహ్మదాబాద్‌లో కాన్సులేట్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని, భారత్-అమెరికా మధ్య వాణిజ్య సహకారం విస్తరిస్తోందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తుందని ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events