ఈ ఏడాది జనవరి – ఫిబ్రవరి మధ్య అమెరికా గగనతలంలో చైనా బెలూన్లు కనిపించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికాపై చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని ఆరోపించింది. ఆ తర్వాత నిఘా బెలూన్లను కూల్చివేసిన విషయం విధితమే. ఈ వివాదం కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫిబ్రవరిలో తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల వివాదం సద్దుమణిగినా బ్లింకెన్ పర్యటన షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ క్రమంలోనే చైనాపై అమెరికా గూఢచర్యానికి పాల్పడుతుందని డ్రాగన్ దేశం ఆరోపించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-25.jpg)
అమెరికా ఉపగ్రహాలు కనీసం 14 సార్లు చైనా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించాయని చెప్పింది. గత రెండేళ్లలో నిఘాకు ప్రయత్నించాయని పేర్కొంటూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యూఎస్ వైమానిక దళం జియోసింక్రోనస్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌కు చెందిన ఉపగ్రహాలు చైనా అత్యంత ప్రత్యేకమైన, అధునాతన ఉపగ్రహాలకు దగ్గరగా వచ్చి గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-23.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-23.jpg)