అమెరికా అంటే తాలిబన్లకు ప్రస్తుతం భయం, గౌరవం లేకుండా పోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాలిబన్ల ముందు ఓటమి అంగీకరించారంటూ బైడెన్‌పై విరుచుకుపపడ్డారు. అఫ్ఘానిస్థాన్ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన విధానం విఫలమైందంటూ మండిపడ్డారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారు. బైడెన్ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. ఇది సేనల ఉపసంహరణ కాదు. ఓటమిని ఒప్పుకోవడం అన్నారు. కాబూల్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎరిగితే ఎంతటి అపఖ్యాతో ఊహించండి. బలహీనత, చేతకానీతనంతో వచ్చిన వైఫల్యం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.