తన ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం అమెరికానే అంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తాను రష్యా పర్యనటలో పుతిన్ను కలుసుకోవడం అగ్రరాజానికి ఇష్టం లేదని, అందుకే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. అమెరికా పేరును నేరుగా ప్రస్తావించని ఇమ్రాన్ ఓ శక్తిమంతమైన అగ్రరాజ్యం అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇమ్రాన్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జలీనా పోర్టర్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని స్పష్టం చేశారు. పాకిస్థాన్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ఆ దేశ రాజ్యాంగ ప్రక్రియ పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగ ప్రక్రియకు తాము మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.














