టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో అమెరికా ఐదు పరుగుల తేడాతో పాక్ పై గెలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.అనంతరం 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అడాల్సి వచ్చింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న మరో గ్రూప్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ అమెరికా ముందు మోస్తరు టార్గెట్ ను సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం (44), షాదాబ్ ఖాన్ (40) ఆకట్టుకున్నారు. మిగిలిన వారు అంతగా మెప్పించలేకపోయారు. అమెరికా బౌలర్ల దాటికి కీలక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అమెరికా బౌలర్లలో నోస్తుష్ కెంజిగే మూడు వికెట్లు తీయగా, సౌరభ్ నేత్రవల్కర్ రెండు వికెట్లు దక్కించు కున్నాడు. అలీ ఖాన్, జస్దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో అమెరికా జట్టు 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.