ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. శుక్రవారం తీసుకొచ్చిన ఈ తీర్మానానికి అనుకూలంగా 12 ఓట్లు వచ్చాయి. స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా తన వీటో హక్కును ఉపయో గించింది. తీర్మానం ఆమోదానికి ఎటువంటి వీటో లేకుండా తొమ్మిది ఓట్లు అవసరం. అయితే అనుకూల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ అమెరికాలో వీటో చేయడంతో తీర్మానం చెల్లకుండా పోయింది. అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రశంసించగా, అన్యాయం, అనైతికమంటూ పాలస్తీనా తీవ్రంగా విమర్శించింది. ఐరాసలో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం పాలస్తీనా 2011 నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. 2012 నవంబరు నుంచి పరిశీలక దేశం హోదా లభించింది.