Skip to main content

Namaste NRI

అమెరికా లొంగిపోయే వరకు ఆగదు …ఇరాన్‌ తాజా హెచ్చరిక!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. శాశ్వత అవమానాన్ని, పశ్చాత్తాపాన్ని, లొంగుబాటును అమెరికా చవిచూసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ నౌకదాళం, వైమానిక దళం దారుణంగా క్షీణించిపోయాయని, ఆ దేశ నాయకత్వం భారీ నష్టాలను ఎదుర్కొందంటూ ట్రంప్‌ చేసిన ప్రసంగానికి ఇరాన్‌ ఈ విధంగా స్పందించింది. ఇరాన్‌ సైనిక సదుపాయాలను, సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనను ఖతమ్‌ అల్‌ అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News