రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురైన అలనాటి అమెరికన్ నటి జూడీ గార్లాండ్‌కు చెందిన కెంపులు పొదిగిన పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి. 1939లో విడుదలై ఘన విజయం సాధించిన ది విజార్డ్ ఆఫ్ ఓజ్ అనే అమెరికన్ చిత్రంలో ఈ పాదరక్షలను జూడీ గార్లాండ్ ధరించి నటించారు.
1969లో గార్లాండ్ మరణించగా తదనంతర కాలంలో ఈ విలువైన పాదరక్షలను ఆమె సొంత ఊరు గ్రాండ్ రాపిడ్స్ పట్టణంలోని జూడీ గార్లాండ్ మ్యూజియంలో భద్రపరిచారు. అయితే 2005లో టెర్నీ జాన్ మార్టిన్ అనే వ్యక్తి వాటిని తస్కరించాడు. 2018లో మార్టిన్ నుంచి ఈ చెప్పులను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది.