అమెరికాకు చెందిన అథ్లెట్ కామెరాన్ బురెల్ (26) ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. కామెరాన్ మృతిపై ఆయన తల్లిదండ్రులు లెరోయ్ బురెల్, మిచెల్ ఫిన్ బురెల్ స్పందించారు. కామెరాన్ మృతికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. అయితే తమ కొడుకు మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కామెరాన్ బురెల్ 2011`18 మధ్య జూనియర్, సీనియర్ కేటగిరిల్లోని పరుగుల పోటీల్లో అనేక గోల్డ్ మెడెల్స్‌ను సాధించాడు. కామెరాన్ తల్లిదండ్రులు కూడా ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను సాధించారు.