అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు నమోదు అవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై భారత భాగస్వామితో రెగ్యులర్‌గా చర్చిస్తామని తెలిపారు. ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనకర అంశాలను గమనిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, పోలీసు, జైలు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.