అమెరికాలో శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. అయితే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థ ప్రయోజనాల నిమిత్తం ప్రపంచంలోని ఏమూల నుంచైనా పని చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. కొంతమంది సిబ్బంది మాత్రమే కార్యాలయానికి వస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది. ఆఫీస్, ఇళ్లు, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, లేదా 170 దేశాల్లోని ఏ మూల నుంచైనా తమ ఉద్యోగులు పనిచేసుకోవచ్చని ప్రకటించింది. పని ప్రాంతం జీతంపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా సంస్థ వెల్లడిరచింది. మరికొద్ది నెలల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సంస్థ సీఈవో బ్రియన్ చెస్కీ తమ ఉద్యోగులందరికి ఈ`మెయిల్ చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)