Namaste NRI

అమెరికన్‌ కాన్సులేట్ కీలక ప్రకటన

అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సమాచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. ఈ నెల 19న సాయంత్రం 3.30-4.30 గంటల మధ్య వర్చువల్‌ స్టూడెంట్‌ వీసా ఇన్ఫర్మేషన్‌ సెషన్‌  ఉంటుందని తెలిపింది.  ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు 19 జూమ్‌ లింక్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఎఫ్‌-1 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అమెరికన్‌ కాన్సులేట్‌ వీసా అధికారి సూచనలు ఇస్తారు. దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఇంటర్వ్యూ, వీసా నిబంధనల గురించి వివరిస్తారు. విద్యార్థి వీసాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఈ సెషన్‌లో ఇస్తామని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events