అమెరికాలో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజులపాటు ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ తెలిపింది. ఈ నెల 27, సెప్టెంబర్ 3న వర్చువల్‌గా కొనసాగే ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో 100కు పైగా అమెరికన్ వర్సిటీలు, కాలేజీలు పాల్గొంటాయని పేర్కొన్నది. ఇందులో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్, రుసుం లేదని వెల్లడిరచింది. మాస్టర్స్, పీహెచ్‌డీ విద్య గురించి సమాచారం తెలుసుకోవాలనుకొనే వారు ఈనెల 27న https://bit.ly/EdUSAFair21EmbWeb, బ్యాచిలర్స్ విద్య గురించి తెలుసుకోవాలనుకొనేవారు సెప్టెంబర్ 3న https://bit.ly/ UGEdUSAFair21 Emb Web ఇందులో లింకుల ద్వారా ఫెయిర్‌ను సందర్శించవచ్చు.
యూఎస్ విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ విభాగం సలహాదారులతో ఈ ముఖాముఖి ఉంటుంది. అమెరికాలో చదువులు, ఫండిరగ్, స్కాలర్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖాముఖి సాయపడుతుంది. విద్యార్థి వీసాల గురించి యూఎస్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ అధికార వర్గాల నుంచి విద్యార్థులకు అవసరమైన సమచారం లభించనుంది.