అమెరికా స్వాతంత్య్ర వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. 246వ అమెరికా స్వాతంత్య్ర వేడుకల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అమెరికా కాన్సుల్ జనరల్ రీప్మన్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాసినా మాట్లాడుతూ అమెరికా స్వాతంత్య్ర వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అమెరికా భారత్‌ల 75 ఏళ్ల భాగస్వామ్య ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అమెరికా కంపెనీలు, సంస్థలు, ఆ దేశ పౌరులతో ఉన్న సంబంధాలు బలాన్నిస్తాయని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)