ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌కు భారత ప్రధాని మోడీ చెప్పడాన్ని అమెరికా మీడియా ప్రశంసించింది. ఉక్రెయిన్‌లో యుద్ధంపై పుతిన్‌ను మోడీ మందలించారు అని వాషింగ్టన్‌పోస్ట్ ప్రధాన శీర్షికలో ప్రచురించింది. అద్భుతమైన రీతిలో బహిరంగ మందలింపు చేశారు. నేటి యుగం యుద్ధయుగం కాదు.. దీని గురించి నేను మీతో ఫోన్‌లో మాట్లాడాను అని మోడీ వ్యాఖ్యానించినట్లు అమెరికా ప్రధాన దినపత్రికి నివేదించింది. ఈ మందలింపు ద్వారా 69 ఏళ్ల రష్యన్ అధ్యక్షుడు అన్నివైపుల నుంచి అసాధారణ ఒత్తిడికి గురవుతున్నట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
మోదీ వ్యాఖ్యలపై పుతిన్ స్పందిస్తూ, ఉక్రెయిన్ సంఘర్షణపై మీ వైఖరి నాకు తెలుసు, మీరు నిరంతరం వ్యక్తం చేస్తున్న ఆందోళన గురించి నాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా దీనిని ఆపేయడానికి మేం గట్టిగా కృషి చేస్తాం. దురదృష్టవశాత్తూ, ఎదుటి పక్షం, ఉక్రెయిన్ నాయకత్వం, చర్చల ప్రక్రియను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. సైనికపరంగానే తన లక్ష్యాలను సాధించుకుంటామని ప్రకటించింది. యుద్ధరంగంలో తేల్చుకుంటామని చెప్పింది. అయినప్పటికీ, అక్కడ ఏం జరుగుతోందో ఎల్లప్పుడూ మీకు సమాచారం ఇస్తూనే ఉంటాం అని చెప్పారు.