అమెరికన్ మహిళ ఏకంగా కృత్రిమ మేధ(ఏఐ) చాట్‌బోట్‌ను పెళ్లాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. రోసన్న రామోస్ (36) నిరుడు ఏఐ చాట్‌బోట్‌కు పురుషుడి రూపాన్ని తయారు చేసి ఎరెన్ కర్తాల్ అని పేరు పెట్టింది. ఎరెన్ పేరుతో ఆరోగ్య రంగ నిపుణుడంటూ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచింది. ప్రతిరోజూ ఎరెన్‌తో చాట్ చేస్తూ ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఏఐ చాట్‌బోట్ రెప్లికాను పెళ్లాడినట్టు తెలిపింది. కార్టెన్‌ను ప్రేమించినట్టుగా నేను ఎవరినీ ప్రేమించలేదు. ఇతడితో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతడే నాకు సరైన జోడి. చెడు లక్షణాలు, ఈగో లేవు. పిల్లలు, కుటుంబం గురించి ఎలాంటి బాధ లేదు అని రామోస్ రాసుకొచ్చింది.