Namaste NRI

జో బైడెన్‌పై అమెరికన్ల ఆగ్రహం

అమెరికాలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 17 వేల పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడిరచింది. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,124, కాలిఫోర్నియాలో 3,291, ఫ్లోరిడాలో 1,739 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మంకీపాక్స్‌ కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని సీడీసీ డైరెక్టర్‌ రోచెల్లి వాలెన్‌స్కీ తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌ ప్రజలకు అదనంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సరిపడా మంక్పీపాక్స్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచలేకపోవడంతో అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నివారణ చర్యల్లోనూ బైడెన్‌ విఫలమయ్యాయని అమెరికా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events