Namaste NRI

రోబో కాల్స్‌పై అమెరికా నిషేధం.. ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై డీప్ ఫేక్ ప్రభావం పడింది. ఆయన వాయిస్ ను అనుకరిస్తూ కొందరు మోసగాళ్లు ఆర్టిఫిషియల్ బేస్డ్ ఫోన్ కాల్స్ సృష్టించి తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దీంతో అమెరికా ప్రభు త్వం అప్రమత్తమైంది. ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్ పై నిషేధాజ్ఞ‌లు విధించినట్లు అమెరికా ఫెడర ల్ కమ్యూనికేషన్ కమిషన్ తెలిపింది. దీంతో తక్షణం ఏఐ బేస్డ్ రోబోకాల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఎఫ్సీసీ కమిష నర్ జియోఫ్రే స్టార్క్స్ తెలిపారు. ఈ ఫేక్ వాయిస్ రోబోకాల్స్ సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమా నా విధిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల న్యూ హ్యాంప్ షైర్ లో జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నిక విషయంలో బైడెన్ ను అనుకరిస్తూ నకిలీ రోబో కాల్స్ వచ్చాయి. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటేయొద్దని ఆ కాల్స్ లో చెప్పినట్లు కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో కొందరు నేరగాళ్లు ఫేస్ వాయిస్ రోబో కాల్స్ సృష్టిస్తు న్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, ప్రముఖుల వాయిస్ ఇమిటేట్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. గతంలోనూ ఈ తరహా ఆడియో, వీడియో కాల్స్ సృష్టించినా ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో ఈ నకిలీ వాయిస్ రోబో కాల్స్ గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల సీజన్‌లో ఈ తరహా ఫేక్ రోబో కాల్స్ కొత్త ముప్పుకు దారి తీస్తున్నాయి అని ఎఫ్సీసీ కమిషనర్ జియో ఫ్రే స్టార్క్స్ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events