రష్యాకు ఉత్తర కొరియా 10,000 మంది సైనికులను పంపించిందని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రిన సింగ్ చెప్పారు. రష్యాలోని కుర్‌స్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ దళాలపై జరుగుతున్న యుద్ధంలో నేరుగా కానీ, సహాయకారులుగా కానీ వీరిని రష్యా వినియోగించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక శిక్షణ ఇవ్వడానికి కూడా వీరిలో కొందరిని ఉపయోగించే అవకాశం ఉందన్నారు. కొందరు సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ సమీపానికి చేరుకున్నారని చెప్పారు. ఉత్తర కొరియా సైనికులను యుద్ధంలో ఉపయోగిం చుకోవడం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని తాము ఇప్పటికే బహిరంగంగా హెచ్చరించామన్నారు.