అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందన్నారు. మరొక బూస్టర్ అవసరం ఉండొచ్చని తెలిపారు. ఒమిక్రాన్ డబ్ల్యూహెచ్‌వో ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించినప్పటి నుంచి అగ్ర రాజ్యంలో సుమారు లక్ష మరణాలు సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగో డోసుపై ఫౌచీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నవంబర్‌లో ఒమిక్రాన్ బయటపడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల మంది కరోనాతో మరణించారని డా.ఫౌచీ ఇది వరకు వెల్లడిరచిన విషయం తెలిసిందే. దీన్ని మహమ్మారి పూర్తిగా విస్తరించిన దశగా అభివర్ణించారు.