ఐక్యరాజ్య సమితికి చెందిన అత్యంత కీలక విభాగం భద్రతా మండలిలో సమూల మార్పులు తీసుకురావాలన్న అమెరికా ప్రతిపాదనకు ప్రపంచ దేశాల నేతలు పలువురు మద్దతు పలికారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ కూడా ఇందులో ఒకటి. నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి, నిరోధకత తదితర లక్ష్యాలను సాధించాలంటే ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేయాల్సి ఉందని జపాన్ ప్రధాని పుమియో కిషిదా నొక్కి చెప్పారు. 21వ శతాబ్ధపు సవాళ్లకు సత్వరమే స్పందించేలా ఐరాసను సంస్కరించుకోవాల్సి ఉందని పోర్చుగీసు ప్రధాని ఆంటోనియో కోస్లా అభిప్రాయపడ్డారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)