విఫలమైన తిరుగుబాటు వెనుక అమెరికా పాత్ర ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఈ సందర్భంగా లావ్రోవ్ మాట్లాడుతూ తనతో విభేదించే దేశాల ప్రభుత్వాలను మార్చేందుకు అమెరికా పన్నని కుట్ర లేదు. తన ప్రపంచాధిపత్యానికి అడ్డంకిగా ఉన్న ప్రభుత్వాలను కూలదోసి, తన ప్రయోజనాలను నెరవేర్చే తొత్తు ప్రభుత్వాలను నెలకొల్పేందుకు అది ఎప్పుడూ కుతంత్రాలు పన్నుతూనే ఉంటుందని పేర్కొన్నారు.