గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆయ్. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అంజి కె.మణిపుత్ర దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, విద్యా కొప్పినీడి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెం ట్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నదని చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ వెరైటీ పాటను మేకర్స్ విడుదల చేశారు. పేరు లేదు ఊరు లేదు ప్రేమించేసిం దండోయ్ అహా.. అమ్మ లాలో రామ్ భజన సాంగ్‌ని విడుదల చేశారు.పద్మావతీ, వేంకటేశ్వరస్వామిల ప్రేమ ను తెలుపుతూ బుర్రకథ పంథాలో సాగే ఈ పాటను దర్శకుడు అంజి కె.మణిపుత్ర రాయగా, అజయ్ అరసాడ స్వరపరిచారు. పెంచల్‌దాస్ ఆలపించారు. తెలుగు సంప్రదాయానికీ, సంస్కృతికీ అద్దంపట్టేలా ఈ పాట చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి.