ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో నిరాధార ఆరోపణలతో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదా లు తలెత్తాయి. తాజాగా భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది. గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య, అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది. గతేడాది డిసెంబర్‌లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లను కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా తెలిపారు. అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 1,08,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86 శాతానికి పడిపోయినట్లు మార్క్ చెప్పారు.
