Namaste NRI

వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న  మాస్‌ ఎంటర్‌ టైనర్‌ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌  అదిరపోయే అప్‌డేట్‌ ఒకటి ఇచ్చి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు.  వాల్లేరు వీరయ్య ఫస్ట్‌ సింగిల్‌ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.  బాస్‌ పార్టీ సాంగ్‌లో చిరంజీవి డ్యాన్స్‌ అదిరిపోనుందని, ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఎక్జయిట్‌గా ఉందని తెలిపారు డీఎస్సీ. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌటేలా స్పెషల్‌ సాంగ్‌లో మెరవనుంది. ఊర్వశి ఇప్పటికే చిరుతో దిగిన స్టిట్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.  ఈ మూవీలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. వాల్తేరు వీరయ్య  2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Social Share Spread Message

Latest News