Skip to main content

Namaste NRI

సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు …సీక్వెన్స్ తో కీలక షెడ్యూల్

హీరో సాయిదుర్గతేజ్‌ నటిస్తున్న భారీ పాన్‌ ఇండియా సినిమా సంబరాల ఏటిగట్టు. రోహిత్‌ కెపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ నెల మధ్యలో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కించనున్నారు. ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో ఈ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతుందని మేకర్స్‌ తెలిపారు. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు విలన్‌గా కనిపించనున్నారు.

ఆయనతో సాయిదుర్గతేజ్‌ తలపడే యాక్షన్‌ సీన్స్‌ ఈ షెడ్యూల్‌లో తీయనున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ యాక్షన్‌ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. జగపతిబాబు, సాయికుమార్‌, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిసామి, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News