Namaste NRI

స్టాటిస్టిక్స్‌లో నోబెల్ అంతటి గౌరవం

భారత్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్తో సత్కరించింది. సీఆర్ రావు 78 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు గాను ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు వరించింది. 102 ఏళ్ల వయసులో ఈ ఏడాదే ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్కతా మేథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆయన చేసిన కృషి , ఇప్పటికీ సైన్స్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events