Skip to main content

Namaste NRI

ఊహలకు అందని విధంగా ఆదర్శ కుటుంబం : విక్టరీ వెంకటేశ్

వెంకటేశ్‌ హీరోగా రూపొందిన ఫ్యామిలీ థ్రిల్లర్‌ ఆదర్శకుటుంబం – ఏకే 47. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మల్లారెడ్డి కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వెంకటేశ్‌ మాట్లాడారు. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్‌ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజులు తిరిగిరావు. ఎంజాయ్‌ చేయండి. కానీ క్యారెక్టర్‌ మాత్రం ముఖ్యం. దాన్ని కాపాడుకోండి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆదర్శ కుటుంబం కేవలం ఒక సాదాసీదా ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు. ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఎన్నో సస్పెన్స్, యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు..

చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మీరంతా ఊహించినట్టు కాకుండా, వేరే విధంగా ఉండే సినిమా ఇది. నార్మల్‌ రొమాంటిక్‌ కామెడీ అంశాలతోపాటు వేరే అంశాలను కూడా ఇందులో చర్చించాం. క్రైమ్‌ కామెడీ ట్రై చేయడం నాకూ, వెంకీ గారికి ఫస్ట్‌టైమ్‌. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ, కథానాయిక శ్రీనిధిశెట్టి, సంగీత దర్శకుడు తమన్‌ తదితర చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events