భారత సంతతి చిన్నారి ఓం మదన్ గార్గ్ సింగపూర్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకున్న అతి పిన్నవయస్కుడైన సింగపూర్ వాసిగా, సింగపూర్ బూక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. తన తల్లిదండ్రులతో కలిసి గార్గ్ 5,364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్ క్యాంప్‌కు చేరుకుని అందరినీ అబ్బురపరిచాడు. ఇందుకోసం చిన్నారి ఏకంగా 65 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేశాడు. గార్గ్‌కు చిన్నప్పటి నుంచే ఇటువంటి సాహసయాత్రలు కొట్టినపిండిగా మారిపోయాయి. రెండున్నర ఏళ్ల వయసు నుంచే ఈ చిన్నారి తన తల్లిదండ్రుల వెంట వియత్నాం, థాయ్‌ల్యాండ్, లావోస్ దేశాల్లో సాహసయాత్రలు చేశాడు.