గౌతంకృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. శ్వేత అవస్తి, రమ్య కథానాయికలు. పి.నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్‌హిల్స్ సతీష్‌కుమార్ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సాధారణ విద్యార్థి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన యువకుడి స్ఫూర్తివంతమైన ప్రయాణమిది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుంది. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రీలోక్ సిద్ధూ, సంగీతం: జుడా శాండీ, దర్శకత్వం: పి.నవీన్‌కుమార్.