తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, మహాసభల అవార్డ్స్ కమిటీ చైర్ రామ్ బోబ్బా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రాన్ని స్వయంగా అందించడం జరిగింది.