థాయ్‌ల్యాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా పై వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో మరో నేత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో ప్రధాని పదవి పోగొట్టుకున్న పెటంగటార్న్ షివత్రాకు కూడా చోటు కల్పించారు. ఆమె కొత్త కేబినెట్‌లో మంత్రిగా చేరారు.

థాయ్‌ల్యాండ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ ఆమోదంతో పెటంగటార్న్ షినవత్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు. ఇక థాయ్‌ల్యాండ్‌కు ఒక్కరోజు తాత్కాలిక ప్రధానిగా సూరియ జంగ్‌రుంగ్‌రియాంగ్‌కిట్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న ఫామ్తామ్ వెచాయచాయ్‌కి తాత్కాలిక ప్రధాన మంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.















