Namaste NRI

ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్ డ్యూయెట్ ప్రారంభం

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం డ్యూయట్‌. రితిక నాయక్‌ కథానాయిక.  మిథున్‌ వరదరాజ కృష్ణన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్టూడియోగ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్‌ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ  చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్‌శంకర్‌ క్లాప్‌నివ్వగా, గోవర్ధన్‌ రావు దేవరకొండ, మాధవి కెమెరా స్విఛాన్‌ చేశారు.

ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు చెప్పారు. త్వరలో ఫస్ట్‌ షెడ్యూల్‌ ప్రారంభిస్తామని నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా తెలిపారు. వైవిధ్యభరితమైన ప్రేమకథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని కో ప్రొడ్యూసర్‌ మధుర శ్రీధర్‌ రెడ్డి అన్నారు. తన కెరీర్‌లోనే ఇదొక స్పెషల్‌ మూవీ అని హీరో ఆనంద్‌ దేవరకొండ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌ రాధాకృష్ణన్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఉదయకుమార్‌, రచన-దర్శకత్వం: మిథున్‌ వరదరాజ కృష్ణన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events