Skip to main content

Namaste NRI

ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ .. గ్లింప్స్ రిలీజ్

యువ కథానాయకుడు రోషన్‌ నటిస్తున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ఛాంపియన్‌. ప్రదీప్‌ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో కథానాయికగా నటిస్తున్న అనస్వర రాజన్‌ పోషిస్తున్న చంద్రకళ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయి పాత్రను ఇందులో ఆమె పోషిస్తున్నట్టు గ్లింప్స్‌ చెబుతున్నది. నాటక కళాకారిణిగా ఎదిగి, తనకంటూ ఓ నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకెళ్లే అమ్మాయి చంద్రకళ. ఈ కథలో చంద్రకళ పాత్ర ఎంత కీలకమో గ్లింప్స్‌లోని సన్నివేశాలు చెబుతున్నాయి. దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమాలోని నాయకానాయికల ప్రేమకథ మనసుల్ని తాకేలా ఉంటుందని వారంటున్నారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కానున్నది.  ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.మది, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సమర్పణ: జీ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News